లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తా
ఆయా కుటుంబం మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని గోజే గావ్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో ఆయాగా విధులు నిర్వహించే గైక్వాడ్ రాజాబాయి తమకు తప్పుడు దస్తావేజుతో పదవి విరమణ ప్రకటించారని ఆరోపించారు. దీనిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి న్యాయం జరగకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపింది. ఈ సందర్బంగా మంగళవారం స్థానిక తహశీల్దార్ ఎండి ముజీబ్ కువినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై ప్రజావాణిలో పలుమార్లు శిశు సంక్షేమ శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. 38 సంవత్సరాలుగా ఆయాగా విధులు నిర్వహిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం 15 నెలలుగా ఎలాంటి జీతభత్యాలు లేవని వెల్లడించింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, తమకు న్యాయం చేయాలని కోరింది.
తప్పుడు దస్తావేజుతో పదవీ విరమణ ప్రకటన.. నాకు న్యాయం చేయండి
- Advertisement -
- Advertisement -



