– సుందరీకరణ పనులు పూర్తి చేయాలి
– జాగ్రత్తలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
– పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ: జిల్లా కలెక్టర్ కె హైమావతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖ, ఏం జీ ఎన్ ఆర్, ఈ జీ ఎస్ కింద నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణాలలో వేగం పెంచి డిసెంబర్ నెల ఆఖరిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్ అండ్ బి శాఖ హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణ పనుల్లో 90 శాతం చెట్లు తొలగింపు పూర్తి చేశారని, ఎలక్ట్రిక్ లైన్ తొలగించడం అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆదేశించారు.
కోహెడ నుండి సముద్రాల రోడ్ బి టి రోడ్ పనులు 15 రోజులు పూర్తి చెయ్యాలన్నారు. హుస్నాబాద్ నుండి రామవరం రోడ్ అక్కన్న పెట నుండి కొత్తకొండ రోడ్ పనులు మరియు ఇతర భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చెయ్యాలని అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మండలాలలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, గాంధీ నగర్, పొట్లపల్లి, బల్లునాయక్ తండా, మహమ్మదాపూర్, మీర్జాపూర్, బంజేరుపల్లి, చౌటాకుంట తండా, పెద్ద తండా, దుబ్బ తండాబత్తుని వాణి పల్లిలో భూమి కొరత భూమి ఉందని, గ్రామాల్లో పాత జీ పి భవనం వేరొక స్థలంన్ని అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు.మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మ చెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం , సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుత్ ఉపకేంద్ర పనులు పురోగతిలో ఉన్నవి పూర్తి చెయ్యాలని తెలిపారు. పూర్తి అయిన వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.మిషన్ భగీరథ మండలాల్లో తాగు నీరు అందించే పనులు సైతం చేపట్టిన పనులు పూర్తి చెయ్యాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగులో వేగం పెంచాలని తెలిపారు. రైతులను కలిసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.అంతకు ముందు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులందరితో కలిసి కొత్త బట్టల పంపిణీ చేశారు.



