Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది..

కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది..

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కష్టసుఖాలలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు అనుమండ్ల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల బీఆర్ఎస్వి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాజీపూర్  గ్రామానికి చెందిన రాయపోల్ బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఉప్పల భార్గవ్ వాళ్ళ చిన్న నాన్న బాల వీరయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అలాగే టెంకంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్వి మండల నాయకులు తిరుపతి కిషన్ వాళ్ళ తాత తిరుపతి యాదయ్య అకస్మాత్తుగా మరణించారు. ఇట్టి విషయం తెలుసుకుని ఆయా గ్రామాలలో వారి ఇరువురి కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని వారి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అధైర్యపడవద్దని మనోధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తిరుపతి నర్సింలు, రామచంద్రం గౌడ్, మాజీ రైల్వే బోర్డు సభ్యులు రేకుల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు ఎనుముల మల్లారెడ్డి, మంతూర్ యాదగిరి గౌడ్, ఆనందరావు, విఠల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -