Wednesday, November 5, 2025
E-PAPER
Homeఖమ్మంవేర్వేరు దొంగతనాలలో ఇరువురు అరెస్ట్

వేర్వేరు దొంగతనాలలో ఇరువురు అరెస్ట్

- Advertisement -

– ఒకరు ద్విచక్ర వాహన దొంగ.. ఇంకొకరు మేకల దొంగ
– ఎస్.హెచ్.ఓ ఎస్సై యయాతి రాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వేర్వేరు దొంగతనాలు లో ఇరువురిని అరెస్ట్ రిమాండ్ చేసినట్లు ఎస్.హెచ్.ఓ ఎస్ఐ టి.యయాతి రాజు మంగళవారం తెలిపారు. ద్విచక్రవాహనం దొంగ మండలంలోని అనంతారంలో ఇటీవల మధ్యాహ్నం సమయంలో ఇంటి బయట పార్కు చేసిన ద్విచక్రవాహనం ఒకటి చోరీ కి గురైంది.

ఆ వాహన యజమాని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,విచారణ చేపట్టిన శిక్షణా ఎస్ఐ అఖిల నేతృత్వంలో సిబ్బంది మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనం అపహరించిన వ్యక్తి తారసపడ్డాడు.అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అశ్వారావుపేట లోని వడ్డెర బజారు కు చెందిన రేపన నాగు గా ఋజువు అయింది.దీంతో అతన్ని అరెస్టు చేసి తదుపరి రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరు పరిచారు.

మేకల దొంగ మేకల దొంగ ను ఒకరిని అరెస్ట్ చేసారు.మంగళవారం ఉదయం ఎస్.హెచ్.ఓ ఎస్సై టి.యయాతి రాజు నేతృత్వంలో పర్యవేక్షణలో  సిబ్బందితో ఊట్లపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వాహన తనకి చేస్తుండగా అపరిచిత వ్యక్తి ఒకరు హీరో గ్లామర్ బైక్ పై ఒక మేకను తరలిస్తూ పోలీస్ సిబ్బంది చూసి ఆందోళన చెందుతూ పారిపోయే ప్రయత్నం చేసాడు. అనుమానం వచ్చి ఆ వ్యక్తిని ఆపి విచారించగా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం కు చెందిన  సున్నం నాగేంద్రబాబు తెలిపాడు.

ఇతని తోపాటు మరికొంత మంది తో మండలంలోని పరిసర గ్రామాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు.ప్రస్తతం తన తన తీసుకొచ్చే మేకపోతు పాపిడి గూడెం లో చోరీ చేసినట్లు తెలిపాడు.ఇలా చోరీ కి పాల్పడిన జీవాలను మాంసం దుకాణం దారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నానని ఒప్పుకున్నాడు. పోలీసు పంచనామా నిర్వహించి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కాగా మిగతా నేరస్తులు పరారీలో ఉండగా, వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -