సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించి ఈ చిత్రం ఈనెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ప్రేరణ అరోరా మీడియాతో పలు చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
తెలుగులో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో నా కల. ఆ కల సుధీర్‌బాబు సినిమాతో నెరవేరటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ద్వారా వెంకట్ అభిషేక్‌ని కలిసాను. అప్పుడు ‘జటాధర’ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఇందులో ఫ్యామిలీ, ఎమోషన్స్, సూపర్ నేచురల్, మైథలాజికల్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి. ఇది పాన్ ఇండియా కంటెంట్. అందుకే హిందీలో కూడా చేశాం.
ఇందులో చాలా ఛాలెంజింగ్‌గా అనిపించే సీక్వెన్స్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా స్పోర్టివ్‌గా, ప్యాషన్‌తో సుధీర్‌బాబు చేశారు. ఇందులో ఆయన నటన ఆడియన్స్‌కి గుర్తుండిపోతుంది.
ధన పిశాచి క్యారెక్టర్‌కి సోనాక్షి పర్ఫెక్ట్. చాలా మెమొరబుల్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే సుధీర్ బాబుతో సోనాక్షికి చాలా హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. శిల్పా శిరోద్కర్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఆ క్యారెక్టర్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి.
మైథలాజికల్ స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నాగబంధం గురించి తెలిసే ఉంటుంది. ధన పిశాచికి సంబంధించి ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని చాలా సర్ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్, బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి.
‘జటాధర’కి సీక్వెల్‌లా, ఫ్రీక్వెలా అని చెప్పలేను. కానీ ఈ సినిమాకి కొనసాగింపుగా ఇంకో సినిమా అయితే ఉంటుంది. మేము తెలుగులో పెద్ద హీరోతో మరో సినిమా చేస్తున్నాం. జీ స్టూడియోస్ మాకు చాలా మంచి కొలాబరేషన్ ఉంది. నేను చేసిన రుస్తుం నుంచి ఇప్పటివరకు మా జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను థ్రిల్ చేసే ‘జటాధర’
- Advertisement -
- Advertisement -



