Wednesday, November 5, 2025
E-PAPER
Homeసినిమావిభిన్న మిథికల్‌ థ్రిల్లర్‌

విభిన్న మిథికల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా ఓ మిథికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న మీనాక్షి విజువల్‌ చాలా క్యురియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. ఫీల్డ్‌ డ్రెస్‌, గ్లవ్స్‌, గ్లాసెస్‌తో అంకితభావం, ధైర్యం గల ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి ఇందులో కనిపించబోతున్నారు. ఈ కథలో ఆమె పాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోంది. ఎమోషన్స్‌, పెర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉండే దక్ష క్యారెక్టర్‌ మీనాక్షి కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ కానుంది. అలాగే నాగ చైతన్య ఈ చిత్రంలో నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. ‘లా పతా లేడీస్‌’ ఫేమ్‌ స్పర్శ్‌ శ్రీవాస్తవ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీడ్‌ కాస్ట్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ బి లోక్‌నాథ్‌, సినిమాటోగ్రాఫర్‌: రగుల్‌ డి హెరియన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నరసింహా చారి చెన్నోజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -