బరిలో సుమారు 200 మంది షట్లర్లు
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్ మంగళవారం ఆరంభమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ సహా మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
- Advertisement -
- Advertisement -



