కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లైఫ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో ఈ చిత్రాన్ని ఆరంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అంజన్న మాట్లాడుతూ,’సరికొత్త ప్రయోగంగా ఈ సినిమాను ఆరంభించాం. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేసి ఇండియా మొత్తం ప్రజాదరణ పొందిన అమ్మాయితో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లుగా దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసాను హీరోయిన్ గా ఎంపిక చేశాం.
ఈ చిత్ర కథ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ఘటన ఆధారంగా వుంటుంది’ అని తెలిపారు. ‘ఇది యూత్ ఫుల్ సినిమా. ఇందులో నేటి తరానికి చక్కటి సందేశం కూడా ఇమిడి ఉంది’ అని దర్శకుడు శ్రీను కోటపాటి చెప్పారు. మోనాలిసా మాట్లాడుతూ,’నాతో తెలుగు సినిమా చేయడం చెప్పలేని ఆనందంగా ఉంది. హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాను’ అని తెలిపారు. సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం:సుకుమార్, సాహిత్యం : కాసర్ల శ్యామ్, డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్, స్టంట్ మాస్టర్ : నందు, ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్, ప్రొడక్షన్ డిజైనర్: డా. సిహెచ్. రత్నాకర్ రెడ్డి.
వాస్తవ ఘటనతో ‘లైఫ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



