- Advertisement -
మంజేరి : మంజేరిలోని లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) కోర్టు 180 ఏండ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. నిందితులపై రూ.11.75 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే దోషులు మరో 20 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఎ.ఎం. అష్రఫ్ ఆదేశించారు. కానీ వారు శిక్షలను ఏకకాలంలో అనుభవిస్తారని స్పష్టం చేశారు.
ఏం జరిగింది..?
డిసెంబర్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు అనమంగడులోని అద్దె ఇంట్లో సుమారు ఏడాది పాటు బాలికను వేధించారు. ఆపై వల్లికపట్టలోని ఒక ఇంట్లో మరో ఏడాది పాటు వేధింపులకు గురిచేశారు. దోషులు బాలికకు మద్యం ఇచ్చి, ఆమె సెక్స్ వీడియోలను చూపించిన తర్వాత ఆమెను వేధించారని కోర్టు దృష్టికి రాగా పై విధంగా శిక్ష వేసింది.
- Advertisement -



