Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంఉద్యోగాల కోసం ఓటు వేయండి

ఉద్యోగాల కోసం ఓటు వేయండి

- Advertisement -

అఖిలేశ్‌ యాదవ్‌

నవాడా (బీహార్‌) : బీహార్‌లో రేపు మొదటి దశ పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఆర్‌జెడికి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ప్రచారం చేశారు. బుధవారం బీహార్‌లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘బీహార్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి. మీ ఓటు ఉదోగ్యాల కోసం వేయాలి. కొత్త తరం తేజస్వికి మద్దతు ఇవ్వాలి అని ప్రజలను కోరారు. బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యోగి చెప్పినవి నమ్మకండి అని అఖిలేశ్‌ ప్రజలకు సూచించారు.

యోగిని నమ్మవద్దు.. ఆయన యోగిగా ఉన్నప్పటికీ అన్ని అబద్దాలే చెబుతారు. ఒక శాతంగా ఉన్న సంపద ఇప్పుడు 62 శాతానికి పెరిగింది. రైతులకు డబ్బులు చెల్లించలేని, యువతకు ఉద్యోగాలు కల్పించలేని వారు ఓటు అడిగేందుకు ఇక్కడిక వస్తారా? అని అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. వారు యుపిలో ఓడిపోయారు. యుపి ప్రజలు వారిని తిరస్కరిం చారు. మొదట అవధ్‌లో ఓడిపోయారు. ఇప్పుడు బీహార్‌లోని మగధ్‌లో కూడా ఓడిపోతారు. ఉపాధి, యువత సాధికారతలో సానుకూల పరివర్తన కోసం తేజస్వియాదవ్‌కు మద్దతు ఇవ్వాలని అఖిలేశ్‌ యాదవ్‌ ఓటర్లను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -