Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాదికాని భూమిని పాసుబుక్ నుంచి తొలగించండి.!

నాదికాని భూమిని పాసుబుక్ నుంచి తొలగించండి.!

- Advertisement -

స్వచ్ఛందంగా తహశీల్దార్ విన్నవించిన…రైతు యశ్వంత్
నవతెలంగాణ – మల్హర్ రావు

మోకాపై సెంట్ భూమి లేకున్నా అక్రమంగా ఆన్లైన్ (డిజిటల్) పట్టాలు పొందుతూ, వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే రైతుభరోసా, బ్యాంకు రుణాలు పొందుతూ ఇటు ప్రభుత్వాన్ని, అటు బ్యాంకు అధికారులను మోసం చేస్తున్న అక్రమార్కులెందరో ఉన్నారనేది బహిరంగ వాస్తవం. కానీ ఇందుకు భిన్నంగా ఓ సంఘటన  తహశీల్దార్ కార్యాలయంలో జరగడంపై అచ్చర్యానికి గురిచేస్తోంది. తన పట్టాదారు పాసుపుస్తకంలో తనకు సంబంధం లేని సర్వే నెంబర్,భూమి యాడ్ అయిందని, ఈ భూమి నాది కాదని,వెంటనే తొలగించాలని గురువారం మండల తహశీల్దార్ రవికుమార్ కు తోట రాజేశ్వర్ రావు విన్నవించారు. మండల తహశీల్దార్ పూర్తి కథనం ప్రకారం మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన తోట యశ్వంత్ తండ్రి తోట రాజేశ్వరరావుకు ఇదే గ్రామ రెవెన్యూ శివారులో సర్వే నేఁబర్ 303/a లో రక్బ 0-39 గుంటల భూమిని తొలగించాలని స్వచ్ఛందంగా వినతిపత్రం అందజేసినట్లుగా తెలిపారు. రాజేశ్వరరావు ఆదర్శంగా తీసుకొని మండలంలో అన్ని గ్రామాల రైతులు తమపై సంబంధం లేని సర్వే నెంబర్లు,అక్రమ పట్టాలు పొందితే రిజెక్ట్ కోసం స్వచ్ఛందంగా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజేశ్వరరావు తహశీల్దార్ శాలువాతో సత్కరించి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -