Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
జూబ్లీహిల్స్ నియోజకవర్గ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి  స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలిపి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -