ఉచిత ఫీజియోథెరపీ పరీక్షలు

నవతెలంగాణ-భిక్కనూర్:
భిక్నూర్‌ పట్టణంలోని దివ్యాంగుల కేంద్రంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు నవీన్ పక్షవాతం, అంగవైకల్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ నిర్వహించి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఎన్.హెచ్.సి కేంద్రం టీచర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love