నవతెలంగాణ – కామారెడ్డి
భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ (ఐ డి ఓ సి ) ప్రాంగణంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
కామారెడ్డి ఐడిఓసిలో వందేమాతరం గేయాలాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



