Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

సీఐటీయూ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్  మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మికులకు అవసరమైన యూనిఫామ్, సబ్బులు, నూనె, చెప్పులు అందజేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రతి రోజు బెల్లం ఇవ్వాలని కోరారు. నెలకొకసారి కార్మికులకు మెడికల్ చెకప్ లు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పీఎఫ్ వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఒక పూట పని చేయించుకుంటున్నారని అలా కాకుండా సెలవు రోజు పూర్తిగా సెలవు ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

స్పందించిన కమిషనర్ శ్రీనివాస్ డిసెంబర్ 15 నాటికి ఎంఎల్ఏ, సబ్ కలెక్టర్ అధ్వర్యంలో మెటీరియల్ అందజేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి, ఎం సి పి ఐ యు రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకన్న, మోహన్, ఎల్లయ్య, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -