కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌
– మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన జీపీ కార్మికులు
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
పంచాయతీ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేసి, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉ పాధ్యక్షులు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జీపీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ సం దర్భంగా కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలి పారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశా రు. వీరికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ మ ద్దతు తెలిపి మాట్లాడారు.. గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని అన్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలని కోరారు. కారోబార్‌ బిల్‌ కలెక్టర్‌ నియమించా లని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కు టుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందించాల న్నారు. పెండింగ్‌ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 51 తీసుకొచ్చి మల్టీపర్పస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వివిధ రకాల కేటగిరీలను రద్దు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గ్రామ పంచాయతీలలో కొత్త ట్రా క్టర్లు వచ్చిన తర్వాత పంచాయతీ కార్మికులతో డ్రైవింగ్‌ చేయించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్నా యని తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిం చడం లేదన్నారు. ఫలితంగా కార్మికుల కుటుంబాలు రో డ్డున పడుతున్నాయని తెలిపారు. మల్టీపర్పస్‌ విధానం రద్దుచేసి పాత విధానం కొనసాగించి కార్మికులను ప్ర భుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కార్మి కుల తొలగింపులు ఆపాలన్నారు. పనిలో నుంచి తొల గించిన కార్మికులను తిరిగి వీధుల్లోకి తీసుకొని, వేతనా లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు మండల అధ్యక్షులు శాంత మ్మ, వెంకటమ్మ, జిలాని, నరసింహులు, బషీరా బాద్‌ మండల అధ్యక్షులు శ్యామప్ప, లక్ష్మి, చందు, పెద్దేముల్‌ మండల అధ్యక్షులు అంబరప్ప, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love