గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌ రాజు
– కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న సమ్మెకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రికి కార్మికుల ఇబ్బందులు చెప్పాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌. రాజు, గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి, బి కే ఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్‌ గోపాల్‌ గ్రామపంచాయతీ జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిలో పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు, పంప్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్స్‌ తదితర కేటగిరిలలో నర్సరీలు, శ్మశానవాటిక పార్కులు, ఆఫీస్‌ నిర్వహణలో విధులు నిర్వహి స్తున్నారని తెలిపారు. 20-30 సంవత్స రాలుగా పనిచేస్తున్న వీరికి ఏ పథకాలు అమలు కావడం లేదన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్‌ చేయాలని, పీఆర్సీలో నిర్ణయించిన బేసిక్‌ ప్రకారం పంచాయతీ సిబ్బందికి రూ.19 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ పంచా యతీ సిబ్బంది సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కార్మికులలో తీవ్రమైన అసంతప్తి ఉందని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి కార్మికుల సమస్యలు పరిష్కరి ంచాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపం చాయతీ కార్మికులు జంగయ్య, రవికుమార్‌, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love