Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్150వ సంవత్సరం సందర్భంగా వందేమాతరం గీతాలాపన 

150వ సంవత్సరం సందర్భంగా వందేమాతరం గీతాలాపన 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు వందేమాతరం ఎంపీడీవో చిలివేరు వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వందేమాతరం  గీత రచయిత బంకించద్ర చటోపాధ్యాయ ను స్మరించుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గీతం ప్రాముఖ్యతను వివరించారు. 150 వ సంవత్సరములు అగుచున్నందున కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో కలిసి   వందేమాతరం  పూర్తి గీతాన్ని ఆలపించడం జరిగింది. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో విద్యాసంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 సంవత్సరాలు పూర్తయినందున వందేమాతరం గీతాన్ని మరోసారి ఆలపించి గుర్తు చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -