Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఎం ఉజ్వల యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభం

పీఎం ఉజ్వల యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండల కేంద్రంలోని జాషువా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభమైనట్లు ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ మురళి తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన మహిళలు తమ పేరుపై ఉచిత ఇండియన్ గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఇంతకుముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ పొందని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని మురళి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంప్రదించవలసిన వారు:
డిస్ట్రిబ్యూటర్ మురళి – 9963435405
కంప్యూటర్ ఆపరేటర్ శివ – 7288911728

దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
రేషన్ కార్డు
ఆధార్ కార్డు
బ్యాంక్ ఖాతా వివరాలు
కరెంట్ బిల్లు
పాన్ కార్డు
రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
అర్హులైన వారు తమ పత్రాలతో జాషువా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ, ఉప్పునుంతలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -