Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

జన్మదిన వేడుకలు పురస్కరించుకొని విశ్రాంతి భవన నైట్ వాచ్మెన్ కు ఘన సన్మానం 
పేదలకు రోగులకు పండ్లు పంపిణీ
మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుక ను ఘనంగా నిర్వహించినట్లు మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక విశ్రాంతిభవనంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అనంతరం విశ్రాంతి భావన నైట్ వాచ్మెన్ ఆగయ్యకు సన్మాన నిర్వహించి ప్రభుత్వ దావకాలలో పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపకు చేరే విధంగా అందిస్తున్నారని అన్నారు. గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు పట్టణ అధ్యక్షులు రత్నపురపు యాకయ్య, నాయిని శ్రీపాల్ రెడ్డి., వలబోజు వెంకటేశ్వర్లు, మంద రవి., గోగుల మల్లయ్య, పులి వెంకన్న, పెరుమాండ్ల జగన్ బాబు,గడ్డం అరుణ్ కుమార్,ఆకుల నర్సయ్య, వెన్నం క్రాంతి రెడ్డ, ఆకుల కొమురయ్య, జి రవి. కృష్ణ, వెంకటేష్, అనిల్, లింగ్య, వర్రే అశోక్, హెచ్చు రవి, హెచ్చు అలివేలు, ప్రశాంత్, ఆఫ్రోజ్, జిలకర యాలాద్రి, బాలాజీ నాయక్, కిషన్ నాయక్, మయ్య వెంకన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -