Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

మద్నూర్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలోఘనంగావేడుకలునిర్వహించారు. కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, ఆయన ప్రజల కోసం చేస్తున్న సేవలను మరోసారి గుర్తు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు అని పేర్కొన్నారు.

పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరస్ సాయిలు, శ్రీనివాస్ పటేల్, హన్మంత్ యాదవ్, హన్మాండ్లు స్వామి, రమేష్ వట్నాల వార్, కొండ గంగాధర్, మహేష్, గోపి, దేవిదాస్, మనోహర్, శివాజీ, సంతోష్ మెస్త్రి, సంగ్రామ్ పటేల్, ఆముల్, చెందు, లక్ష్మణ్, ఈరన్న, సాయిబాబా, సంతోష్, బండి గోపి, హన్మాండ్లు, దిగంబర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -