డిసిఒ శోభారాణి
నవతెలంగాణ – తుంగతుర్తి
క్రీడల్లో గెలుపోటములు సహజమని,ఓటమి నుండి గెలుపు కోసం కృషి చేయడమే సంక్షేమ విద్యార్థుల లక్ష్యమని డిసిఓ శోభారాణి అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సారథ్యంలో నిర్వహిచిన,11వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్2025-26 క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో సూర్యపేట,యాదాద్రి భువనగిరి,జనగాం జిల్లాల నుండి 9గురుకుల పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని,పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు.క్రీడల్లో ముందుకు సాగాలంటే నిరంతరసాధన,క్రమశిక్షణనే ముఖ్యమని అన్నారు. అనంతరం ముగింపు వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి,నిడమనూరు ప్రిన్సిపాల్ ఉషారాణి,కట్టంగూరు ప్రిన్సిపాల్ శమంతకమణి, తిప్పర్తి ప్రిన్సిపాల్ సునీత,చండూరు ప్రిన్సిపాల్ అర్జున్,రావులపల్లి హెచ్ఈవో రవికుమార్,వెలుగుపల్లి పల్లె దవాఖాన డాక్టర్ కుంభం విజయ కుమార్,తల్లిదండ్రుల కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొండగడుపుల ఎల్లయ్య,జోనల్ మీట్ లో పాల్గొన్న వివిధ పాఠశాలల పీడీలు,పీఈటీలు విద్యార్థినిలు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఓటమి నుంచి గెలుపు కోసం కృషి చేయడమే సంక్షేమ విద్యార్థుల లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



