– పంట నష్టం చేసిన ఖాబ్జా దారు… పట్టించుకోని సంబంధిత అధికారులు
– న్యాయం చేయాలని వేడుకొలు
– ఖబ్జాకు సహకరించకపోతే గడ్డి మందుకొట్టి పంటనష్టం
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిద్నెపల్ల గ్రామానికి చెందిన తోడె రామక్క w/o మధునయ్య కు సర్వే నెం 180, శివారు చిద్నెపల్లి విస్తీర్ణం 0-33 గుంటలు భూమి కలదు. ఇట్టి భూమిపై అదే గ్రామానికి చెందిన బండం సమ్మక్క గత నాలుగు సంవత్సరాల నుండి ఈ భూమి నాదని, ధౌర్జన్యం చేస్తుంది. ఈ సందర్బంగా తోడె రామక్క మీడియాతో మాట్లాడుతూ… ఈ భూమి నాకు మా మామ నుండి వారసత్వం గా వచ్చింది. నేను గత కొన్ని సంవత్సరాలనుండి వ్యవసాయం చేస్తున్నాననీ, సర్వం హక్కులు నాయె నని అన్నది. గత ఐదు రోజుల క్రితం భూ ఆక్రమణదారు అయిన బండం సమ్మక్క నా భూమి దగ్గరకు అర్దరాత్రి వచ్చి గడ్డి మందుకొట్టి పంటనష్టం చేసిందన్నారు. గతంలో ఈమెపై తహసీల్దార్ కు ఫీర్యాదు చేయగా ఆయన భూమి దగ్గరకు సంబందిత అధికారులనీ పంపి మోఖ పంచనామ చేసి ఇవ్వడం జరిగింది.
బండం సమ్మక్క కు ఈ సర్వే నెంబర్ భూమి లేదని, ఈ భూమి మీద ఆమెకు ఎలాంటి హక్కులు లేవని, ఇవ్వడంతో ధరణి లో ఆన్లైన్ చేసుకోవడం తో కొత్త పాసుబుక్ మంజూరు అయినదని అన్నారు. కాని గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం బండం సమ్మక్క పత్తి, వరి పై గడ్డి మందుకొట్టి పంటనష్టం చేస్తుందనీ, పలుమార్లు సంబంధిత రెవెన్యూ , పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నన్ను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు నా సమస్య ను పట్టించుకొనీ నాకు భూ ఆక్రమణదారు అయిన బండం సమ్మక్క పై కఠిన చర్య తీసుకొని నాకు పంటనష్ట పరిహారం ఇప్పించగలరనీ అధికారులకు. మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట తోడె శ్రీనివాస్, రాజయ్య,సంపత్, కాయిరి పోచమల్లు, జాడి నాగరాజు. తోట చంద్రయ్య, చౌటపెల్లి వీరయ్య, సాక్షులు గా ఉన్నారు.



