Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గురుకులాల జోనల్  క్రీడా పోటీల ముగింపు 

ఘనంగా గురుకులాల జోనల్  క్రీడా పోటీల ముగింపు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల లో గత మూడు రోజుల్లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రెండవ జోన్ బాలుర జోనల్ స్థాయి క్రీడ పోటీలు శనివారంతో ఘనంగా మిగిసాయి. క్రీడ పోటీల ముగింపు కార్యక్రమానికి  పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. సత్యనారాయణ గౌడ్,  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల  జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి జి. మాధవి లత, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడా పోటీలలో బాసరజోన్ పరిధిలో నడుస్తున్న 12 సాంఘిక సంక్షేమ గురుకులాల బాలుర పాఠశాల కళాశాల నుండి సుమారు 1020 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని క్రీడలతో మన నైపుణ్యాన్ని కనబరిచారు.

బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, నిర్మల, అదిలాబాద్, జగిత్యాల, జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోని కామారెడ్డి జిల్లాల జిల్లాలలో గల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు క్రీడల్లో పాల్గొని సత్తా చాటారు. క్రీడాంశాలు అండర్ 14, అండర్ 17, అండర్ 19, లుగా మూడు కేటగిరీలలో నిర్వహించబడ్డాయి వాలీబాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, టెక్నిక్, కబడ్డీ, క్యారం, చెస్, కోకో,  లలో నిర్వహించబడ్డాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా విచ్చేసిన ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా వ్యాయామాన్ని మరియు మానసికల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు కలుగుతాయని తెలిపారు, విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అది ముఖ్య అది సాధించే  వరకు కష్టపడాలని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ల కు బానిస కాకూడదని, దుర్వాసనలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం క్రీడల్లో పోటీలలో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్స్ ట్రోపీ లు  అందజేశారు, ఈ క్రీడా పోటీలలో ఉప్పల వై ఓరల్ చాంపియన్షిప్లు గెలుపొందడం జరిగింది. ఈ కార్యక్రమంలోఅధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -