– మానవసేవే మాధవ సేవగా భావిస్తా..
– హెడ్ కానిస్టేబుల్ వెంకోజి..
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దండోత్కర్ వెంకోజి సమాజానికి తన వంతు సేవ అందించాలని సదుద్దేశంతో ఊరుకొండ మండల కేంద్రం నుండి ఊరుకొండ పేట వరకు గల రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్లను, పిచ్చి మొక్కలను సొంత నిధులతో తొలగించారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పాఠశాల ఆవరణ మొత్తం గుంతల మయంగా ఏర్పడింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకోజి.. మానవసేవి మాధవసేవ అని పాఠశాల ఆవరణలో గుంతల మయంగా ఉన్న పరిసరాలను మొరం పోసి చదును చేశారు. ఊరుకొండ మండల కేంద్రం నుండి ఊరుకొండ పేట వరకు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న కంపచెట్లను, పిచ్చి మొక్కలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు హర్షం చేశారు.
సమాజ సేవలో ఊరుకొండ హెడ్ కానిస్టేబుల్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



