ఎప్పుడైనా, ఎక్కడైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించి, మంచిని గ్రహిస్తూ, చెడును త్యజిస్తూ ముందు కెళ్లటమే మన పని. తనది అలాంటితత్వమే అంటున్నారు బీఆర్‌ఎస్ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి. ఆయనది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇటీవల తెలంగాణ భవన్‌లో ఓ జర్నలిస్టు.. మరో జర్నలిస్టును పరిచయం చేస్తూ… ‘సార్ ఈయన మీ పాలమూరు ముద్దు బిడ్డే సార్.. కాస్త బాగా చూసుకోండి…’ అంటే, ‘అవునా.. తప్పకుండా’ అని సమాధానమిస్తూనే, ప్రతీచోటా ముద్దుబిడ్డలే కాదు, మొద్దుబిడ్డలు కూడా ఉంటారంటూ సెటైర్ విసిరారు రావుల. ‘మీరు పెద్దోళ్లు సార్, ఎన్ని సెటైర్లయినా వేస్తారు.. వాటిని తట్టుకోవటం కష్టం కదా…?’ అని మరో జర్నలిస్టు కామెంట్ చేయగా… ‘చూడండి సార్, నాదేముంది, ఒకప్పుడు నేను పాలకుణ్ని (టీడీపీ అధికారపక్షంగా ఉన్నప్పుడు రావుల ప్రభుత్వవిప్‌గా పనిచేశారు)… ఇప్పుడేమో ద్వార పాలకుణ్ని (ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నేతగా ఉన్నారు)… అంటూ రావుల మరో సెటైర్ వేయటంతో పాత్రికేయులు వారేవా సార్ అంటూ చప్పట్లు కొట్టారు… ఆయన సందర్భోచిత సెటైర్‌కు ఫిదా అవుతూ…
-బి.వి.యన్.పద్మరాజు
ముద్దుబిడ్డ.. మొద్దు బిడ్డ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


