– జోరులో కాంగ్రెస్
– కానరాని కేసీఆర్
– అభ్యర్థిని పట్టించుకోని బీజేపీ
– జూబ్లీహిల్స్‌లో రసవత్తరంగా ముక్కోణం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపించింది. ఆదివారం ప్రచారం ముగియనుంది. ఆయా రాజకీయపార్టీల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. సోమవారం మైకులు మూగబోనున్నాయి. ఇంటింటి ప్రచారంలో అనేక మతులబులు జరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మూడు పార్టీల అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్న నేపథ్యంలో గెలుపుపై అంచనాలు, ఉహాగానాలు పెరిగిపోతున్నాయి. వందల కోటు ఖర్చు పెడుతున్నాయనే ప్రచారం సైతం ఉంది. ఆయా మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలు సర్వేలు సైతం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తరపున ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఇతర సీనియర్ నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెడుతున్నారు. రాజీవ్‌గాంథీ విజన్‌ను ఓటర్ల దృష్టికి తెస్తున్నారు. అదే బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచారానికి ఆపార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడం గమనార్హం. హరీష్‌రావు తండ్రి చనిపోవడంతో కేటీఆరే అంతా తానై వ్యవహరిపస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున స్థానిక కేంద్ర మంత్రులు, ఒకరిద్దరు ఇతరులు ప్రచారానికి వచ్చారు. కానీ కీలకమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ వస్తానని చెప్పి రాలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఎంపీ తేజస్వీ సూర్య, అన్నామల్లే, పురంధేశ్వరి తదితరులు సైతం ప్రచారంలో పాల్గొనలేదు. ఈ విషయంలో ఆ పార్టీలో అసంతృప్తి నెలకొందనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గోపినాథ్ మరణాన్ని సెంటిమెంట్ కింద వాడుకుంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గులాబీ నేతలు ఏజెండా చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే దివంగత మాగంటి గోపినాథ్ మరణాన్ని కేంద్ర మంత్రి బండి సంజరుకుమార్ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉప ఉన్నిక నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈనెల 11 సాయంత్రం నుంచి 15వ తేదీసాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలతోపాటు హోటళ్లు, రెస్టారెంటులు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని స్పష్ట చేశారు. కాగా జూబ్లీహిల్స్‌లో దాదాపు 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిని ప్రభావితం చేసేందుకు మూడు పార్టీల అభ్యర్థులు నానాతిప్పలు పడుతున్నారు. 11న పోలింగ్ బూత్‌లకు ఓటర్లు వచ్చేలా అభ్యర్థులు వ్యక్తిగత శ్రద్దతీసుకుంటున్నారు. బూత్‌లవారీగా ఇప్పటికే కమిటీలు వేసి రప్పించేందుకు శ్రమిస్తున్నారు. ఈ ముక్కోణపు పోటీపట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సోషల్‌మీడియాను సైతం అభ్యర్థులు ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. అనేక ఉహాగానాల నేపథ్యంలో అటు పార్టీలు, ఇటు అభ్యర్థులు పోటాపోటీగా ఉప ఎన్నిక బరిని సవాల్‌గా తీసుకున్నారు.
క్లైమాక్స్‌లో ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



