– అక్టోబర్ 15 16 17 తేదీలలో డీటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రజితోత్సవ మహాసభలు
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
డిటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రజితోత్సవ మహాసభలు అక్టోబర్ 15 16 17 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య తెలిపారు. ఆదివారం సంఘం కార్యాలయంలో ఈ మాసభల ప్రచార పోస్టల్ ఆవిష్కరించి అనంతరం మాసబల జయప్రద కోసం సంఘం నాయకులకు దిశా నిర్దేశకం చేశారు.3 రోజులపాటు జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుండి ఉపాధ్యాయులు తరలి వస్తారని తెలిపారు. మంచి ప్రభుత్వ బడి, మంచి విద్య ప్రజలందరి హక్కు అనే ప్రధాన అంశంపై ఈ సభలు జరగబోతున్నాయని ఈ సభల ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్యారంగ సమస్యలను చర్చించడానికి మహాసభలు వేదిక కాబోతున్నాయని ఈ సభలలో డాక్టర్ వికాస్ గుప్తా జాతీయ విద్యా విధానం 2020 ఉన్నత విద్యారంగంలోని సవాళ్లు, ఎన్ వేణుగోపాల్ సంక్షుబిత సమాజంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులు, కన్నెగంటి రవి వ్యవసాయ రంగం రైతాంగ ఉద్యమాలు, ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాల పాలనలో ప్రజల హక్కులు, కే శ్రీనివాస్ ప్రజాస్వామ్యంలో ప్రసారమాధ్యమాల పాత్ర, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే సాహిత్యం మహిళలు, పి వరలక్ష్మి సాంస్కతిక రంగంలో తిరోగమన ధోరణులు, డి రమేష్ పట్నాయక్ జాతీయ విద్యా విధానం 2020 పాఠశాల విద్యారంగంలోని సవాళ్లు, ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ కార్పొరేటీకరణలో దళితులు ఆదివాసీలు అనే అంశాలపై ప్రసంగిస్తారని ఈ ప్రసంగపాఠాల నుండి ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని విద్యారంగ అభివద్ధికి మరింత పాటుపడే అవకాశాలు ఉంటాయని ఈ సభలలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, జిల్లా అధ్యక్షులు ఆదిత్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రవీందర్ గౌడ్, వామన్ కుమార్ సంధ్యారాణి, శేఖర్ రెడ్డి, రఫీ కురుమయ్య ,ప్రభాకర్ ,నర్మదా తిమ్మప్ప, పాల్గొన్నారు.