రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్
నవతెలంగా-హైదరాబాద్ : రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 295/7తో ఆడుతోంది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డి నాల్గో రౌండ్‌లో శనివారం ఉప్పల్ స్టేడియంలో ఆరంభమైన మ్యాచ్‌లో కెప్టెన్ రాహుల్ సింగ్ (55, 84 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరువగా.. రాహుల్ రాడేశ్ (85 నాటౌట్, 163 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీ కదం తొక్కగా హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మరు అగర్వాల్ (6), అభిరథ్ రెడ్డి (9) విఫలమవగా.. హిమతేజ (39), వరుణ్ గౌడ్ (23), రోహిత్ రాయుడు (47) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. తొలి రోజు ఆట ముగిసేసరికి రాహుల్ రాడేశ్, తనరు త్యాగరాజన్ (5 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచారు. రాజస్తాన్ బౌలర్లలో అనికెత్ చౌదరి (2/35), అశోక్ శర్మ (2/61) రెండేసి వికెట్లతో రాణించారు.
హైదరాబాద్ 295/7
- Advertisement -
- Advertisement -



