వెస్ట్‌బ్యాంక్ : ఇజ్రాయిల్ సెటిలర్లు వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 264 దాడులు జరిగాయని, 2006 తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దాడుల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతోందని, రోజుకు సగటున ఎనిమిది ఘటనలు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించింది.
‘2006 నుంచి ఇప్పటి వరకూ 9,600 దాడులు జరిగాయి. వీటిలో 1,500 దాడులు ఒక్క సంవత్సరంలోనే జరిగాయి’ అని ఐరాసకు చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వివరించింది. వెస్ట్‌బ్యాంకులో 27 లక్షల మంది పాలస్తీనీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ పక్కనే ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్ పాలస్తీనా రాజ్య ప్రణాళికకు గుండెకాయ వంటిది. ఇదే ప్రాంతంలో ఐదు లక్షల మందికి పైగా ఇజ్రాయిలీ సెటిలర్లు నివసిస్తున్నారు. వీరు పాలస్తీనీయులపై అనునిత్యం దాడులు జరుపుతుంటారు. కాగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇప్పటి వరకూ ఇజ్రాయిల్ దళాల చేతిలో 42 మంది పాలస్తీనా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనీయులపై రికార్డు స్థాయిలో దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



