నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రజాధనం వృధా..
నవతెలంగాణ- అచ్చంపేట
తహశీల్దార్ కార్యాలయానికి కులం, ఆదాయం సర్టిఫికెట్ కోసం, భూములు అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్లు, ఇలా దాదాపు 50 పనుల నిమిత్తం అవసరాల కోసం పల్లె ప్రజలు మండల తహశీల్దార్ కార్యాలయానికి వస్తుంటారు. విద్యుత్ సమస్యల కారణంగా పనులకు ఇబ్బందులు అటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తహశీల్దార్ కార్యాలయాలలో లక్షలు ఖర్చు చేసి జనరేటర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఉపయోగించకుండా సంబంధిత అధికారులు గాలికి వదిలేశారు. పర్యవేక్షణ చేయవలసిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. 20 తహశీల్దార్ కార్యాలయంలో ఒకటి చొప్పున జనరేటర్ ఏర్పాటు చేశారు. నిర్వాహర లోపం కారణంగా విలువైన జనరేటర్లు తుప్పు పట్టి పోతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి తహశీల్దార్ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన జనరేటర్లు వినియోగంలోకి తీసుకురావాలని ఆయా మండల పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
తహశీల్దార్ కార్యాలయాలలో నిరుపయోగంగా జనరేటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



