Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

సీఐటీయూ నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
రామన్నపేటలో నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలో జిల్లా నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, జిల్లా కోశాధికారిగా యండి పాషా లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా 4 వ మహాసభలో జిల్లా వ్యాప్తంగా 300 మంది కార్మిక వర్గ  ప్రతినిధులు హాజరయ్యారని, ఈ మహాసభలో నిర్వహించిన పోరాటాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్షులుగా కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శిగా తిరిగి రెండవసారి కల్లూరి మల్లేశంలు ఎన్నికైనారని తెలిపారు. నూతన జిల్లా కమిటీని 44 మందితో,జిల్లా ఆఫీస్ బేరర్స్ నీ 14 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి పాండు, దోనూరి నర్సిరెడ్డి, మాయ కృష్ణ, సుబ్బూరు సత్యనారాయణ, నకిరేకంటి రాము, జిల్లా సహాయ కార్యదర్శులుగా గొరిగే సోములు ,తుర్కపల్లి సురేందర్, సిలువేరు రామకుమారి ,పొట్ట యాదమ్మ, చెక్క రమేష్, పైళ్ల గణపతి రెడ్డి లతో పాటు 44 మంది కమిటి సభ్యులను మహాసభ  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

 ఈ మహాసభలో పలు  తీర్మానాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీఎల్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పిఎఫ్  ఆఫీస్ లను  మంజూరు చేయాలని, 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలకు వేతన సవరణలు చేయాలని, నూతన మోటార్ వాహన చట్టం – 2019 నీ రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవొద్దని, స్కీమ్ వర్కర్స్ కనీస వేతనం అమలు చేయాలని, కోరుతూ  15 తీర్మానాలను మహాసభలో చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని వారు  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -