ఘనంగా మహాత్మా 154వ జయంతి వేడుకలు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ నగర్ లో  కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. గాంధీజీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పోరాటయోధుడు అని కొనియాడారు. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేయడమే కాకుండా గాంధీజీ చెప్పిన విషయాలను పాటిస్తూ ఆయన ఆశయాల సాధనకై ముందుండాలని పేర్కొన్నారు.ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పాలకవర్గం సభ్యులు, గ్రామాల్లో యువజన సంఘం సభ్యులు గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు బుచ్చి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, సాయికుమార్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు రమణయ్య, శంకర్, భూపతి, నరేందర్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love