Monday, November 10, 2025
E-PAPER
Homeజిల్లాలుభారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలి..

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలి..

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కోరారు. సోమవారం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాజోలి పొలిమేర నుండి శాంతినగర్ వరకు రోడ్డు అద్వానంగా ఉందని 3 కిలోమీటర్ల పరిధి ఉన్న రోడ్డులో ప్రయాణించాలంటే 30 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.

రోడ్డు గుంతలో పడి వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తుందని రోడ్డు మార్గాన ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వృద్ధులు స్కూల్ విద్యార్థులు గర్భిణీలు ప్రయాణించడం వీలు లేకుండా ఉన్నదని అన్నారు. గత నెల 14న రోడ్డు వేయాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి రోడ్డుపై రాస్తారోకో చేసిన అధికారులు రోడ్డు వేయలేదని అన్నారు పలుమార్లు రాజోలి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన పట్టించుకోవడంలేదని విమర్శించారు. రెండు రోజుల్లో మొరం వేసి గుంతలను పూడ్చుతామని రాజోలి వడ్డేపల్లి తాసిల్దార్లు హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్న గుంతలు పూర్చక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని లేనియెడల ఆందోళనలకు పిలుపు ఇస్తామని హెచ్చరించారు వినతి పత్రం ఇచ్చిన వారిలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ పరంజ్యోతి జిల్లా కార్యదర్శి జి రాజు జిల్లా కమిటీ సభ్యులు విజయకుమార్ వెంకటస్వామి సవరన్న మధు సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -