Monday, November 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి: ఇంచార్జ్ ఏవో

రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి: ఇంచార్జ్ ఏవో

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
రైతులకు ఎరువులు విత్తనాల దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని జన్నారం ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎరువుల దుకాణాలలో నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విత్తనాలు అమ్మ వద్దని అమ్మితే కఠిన చర్యలు తప్పమన్నారు. ఈపాస్ మిషన్లో ఉన్న వివరాలతో గ్రౌండ్ లెవెల్ స్టాక్ వివరాలు సమానంగా ఉండాలన్నారు. లైసెన్సులు, బిల్ బుక్ ల పైన వ్యవసాయ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి దగ్గర సీడ్ సేల్ సర్టిఫికెట్ ఉండాలనన్నారు. అలాగే విత్తనాలను కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు. అనంతరం యూరియా కేటాయింపు గురించి చర్చించి, ఎరువుల దుకాణాల లైసెన్సులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు త్రిసంద్య, దివ్య, సాయి, లవన్, అక్రమ్, ఎరువుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -