- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
దండేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ సోమవారం జన్నారం మండల వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జన్నారం ఏవో సంగీత సెలవుపై వెళ్లడంతో, అంజిత్ కుమారు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తాను రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తానని అంజిత్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
- Advertisement -



