Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు..

అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు..

- Advertisement -
  • ఎన్ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి..
  • నవతెలంగాణ – భువనగిరి
  • తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన అకాల మరణం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని ఎన్ డి సి సి బి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతాన్ని ఆయన రచించి చిరస్థాయిలో నిలిచిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు రాష్ట్ర ప్రజలు, యువతను ఊరుతలూగించాయన్నారు. ప్రముఖంగా జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగురాలి’ అంటూ అందెశ్రీ రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజలను మేల్కొలిపి ఉద్యమం వైపు నడిపించింది.

  • రచనల రూపంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. తమ చిన్న కూతురు హర్షిత నిశ్చితార్ధం,  వివాహా వేడుకలో పాల్గొని పెళ్లి మండపంలో గంట సేపు నిలబడి, మా కూతురు, అల్లుడిని ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఆయన ఇంత తొందరగా తుదిశ్వాశ విడిచాడని తెలిసి, మనస్సుకు బాదగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలువాలన్నారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -