Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంయూఎస్‌ నుంచి చమురు దిగుమతులు పైపైకి

యూఎస్‌ నుంచి చమురు దిగుమతులు పైపైకి

- Advertisement -

ట్రంప్‌నకు మోడీ దాసోహం
హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ భారీగా దిగుమతి


న్యూఢిల్లీ : అమెరికా నుంచి భారత చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ఆంక్షలకు బెదిరి ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లను పెంచేలా చమురు కంపెనీలపై ఒత్తిడి తెచ్చారని ఇటీవలి వరుస గణంకాలు స్పష్టం చేస్తోన్నాయి. చౌకగా లభించే రష్యా చమురును తగ్గించుకోవడంతో పాటు యుఎస్‌ నుంచి దిగుమతులను పెంచేశారు. ప్రభుత్వ రంగ రిఫైనరీ సంస్థలైన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌), మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) సంస్థలు ఇటీవల 50 లక్షల బ్యారెళ్ల చమురును అమెరికా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి కొనుగోలు చేశాయని రాయిటర్స్‌ వెల్లడించింది.ఎంఆర్‌పీఎల్‌ జనవరి 1-7 కాలానికి గాను 10 లక్షల బ్యారెళ్ల చమురుకు ఆర్డర్‌ పెట్టింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌, అబుదాబీ నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేసింది.

ఈ ఏడాది అక్టోబర్‌ అమెరికా నుంచి భారత్‌కు గత ఐదేండ్లలో ఎప్పడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో యూఎస్‌ వాటా 12 శాతానికి పెరిగింది. ఇంతక్రితం సెప్టెంబర్‌లో ఇది 4.5 శాతంగా ఉంది. డేటా అనలిటిక్స్‌ సంస్థ కెప్లర్‌ నివేదిక ప్రకారం.. అక్టోబర్‌లో యూఎస్‌ నుంచి భారత్‌ రోజుకు సగటున 5,68,000 బ్యారెల్స్‌ ముడి చమురును దిగుమతి జరిగింది. 2021 మార్చి తర్వాత ఈ స్థాయిలో దిగుమతులు జరగడం ఇదే మొదటిసారి. సెప్టెంబరులో దిగుమతులైన 2,07,000 బ్యారెల్స్‌తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం ఆందోళనకరం. ఇది ట్రంప్‌ ఆంక్షలకు భారత్‌ తలొగ్గిందనడానికి నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -