Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీచర్‌ లక్ష్మీకాంతన్‌ భేష్‌

టీచర్‌ లక్ష్మీకాంతన్‌ భేష్‌

- Advertisement -

నవీన్‌ నికోలస్‌ అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి జెడ్పీహెచ్‌ఎస్‌ ఫిజిక్స్‌ టీచర్‌ ఎ.లక్ష్మీకాంతన్‌ పాఠశాల విద్య సంచాలకు లు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ నుంచి ప్రశంసలందుకున్నారు. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ స్కీం (ఎన్‌ఎంఎంఎస్‌)తో పాటు పోటీ పరీక్షల కోసం ఎనిమిదో తరగతి విద్యార్థు లకు వినూత్న పద్ధతిలో ఉచితంగా ఆన్‌లైన్‌ తరగతులను ఆయన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 255 స్కూల్స్‌ నుంచి 897 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లక్ష్మీకాంతన్‌ ఐసీటీ అవార్డు గ్రహీత, ఇప్పటికే ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ కోసం రిసోర్స్‌ పర్సన్‌ గా సేవలందించారు. ఈ నేపథ్యంలో లక్ష్మీకాంతన్‌ ఇస్తున్న ఆన్‌లైన్‌ కోచింగ్‌ సాంకేతికత, ఉపాధ్యాయుల అంకితభావం కలిస్తే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనేందుకు తార్కాణమని నికోలస్‌ కొనియాడారు. ఒక టీచర్‌గా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం లక్ష్మీకాంతన్‌ చొరవ చూపించారన్నారు. నూతన అభ్యసన పద్ధతులను ప్రోత్సహిస్తున్న నిజామాబాద్‌ డీఈవో పి.అశోక్‌, ఆయన టీం అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -