Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కుచట్టం, గ్రామసభల నిర్వహణపై శిక్షణ 

సమాచార హక్కుచట్టం, గ్రామసభల నిర్వహణపై శిక్షణ 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు సమస్యలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు గ్రామస్థాయి అధికారులు సమాచారం హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి  నాగేంద్ర గారు సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి మాస్టర్ ట్రైనర్ కృష్ణ గ్రామసభల్లో పాల్గొనే గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు.

కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామస్థాయి అధికారులు ప్రతినెల గ్రామసభలను నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడమే కాకుండా సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఇట్టి శిక్షణా కార్యక్రమంలో అనుబంధ శాఖలు పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖల నుండి  37 మంది గ్రామస్థాయి సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బందితో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు సహాయ కార్యం నిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు, డివిసనల్ పంచాయతీ అధికారి ప్రవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -