Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రక్ షీట్ జారీపై విజిలెన్స్ విచారణ

ట్రక్ షీట్ జారీపై విజిలెన్స్ విచారణ

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆలగడపల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ జారీ చేయడంపై మంగళవారం విజిలెన్స్ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైతులు సారెడ్డి సైదిరెడ్డి, ధనావత్ తులస్యనాయక్లను విచారించారు. ఎంత ధాన్యం, ఎక్కడి నుంచి తెచ్చారు. ఏ మిల్లులకు తరలించారో వివరాలు సేకరించారు. అదేవిధంగా పీఏసీఎస్ ఇన్చార్జి సీఈవో సైదులు, వ్యవసాయా విస్తరణాధికారి అఫ్రీన్లు ధాన్యం రాకుండా ట్రక్ షీట్ ఎలా మంజూరు చేశారని, ట్యాబ్లో ఎలా అప్లోడ్ చేశారని ప్రశ్నించి వివరాలు సేకరించారు. విచారణలో 741బస్తాలు(296.40 క్వింటాళ్లు) ధాన్యం, పట్టణ పరిధిలోని శ్రీశివసాయి రైస్ ఇండస్ట్రీస్కు తరలించినట్లు విచారణలో రైతులు పేర్కొన్నారు. కాగా పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ యాదగిరి పేర్కొన్నారు. ఆయన వెంట వ్యవసాయాధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -