Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

- Advertisement -

మద్దతు ధరకు అదనంగా లభిస్తున్న ధాన్యం ధర
3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు
సూర్య రైస్ ఇండస్ట్రీస్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ఈ సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా  మిల్లర్లు సాఫీగా ధాన్యం కొనుగోలు చేయాలని, మిర్యాలగూడ సబ్ కలెక్టర్  నారాయణ్ అమిత్ మాలెంపాటి ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో పరిధిలో గల సూర్య రైస్ ఇండస్ట్రీస్ ను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ధాన్యం ట్రాక్టర్ ల వద్ద ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన తదుపరి రైతులతో ధాన్యం ధర విషయంలో ముచ్చటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశానుసారం ప్రతిరోజు రైస్ మిల్లులను తనిఖీ చేయడంతో పాటు లభిస్తున్న ధరలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. రైస్ మిల్లర్లు అన్ని వెరైటీల దాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తెచ్చిన సమయంలో ఆలస్యం చేయకుండా దిగుమతి చేసుకోవాలన్నారు.

ప్రస్తుతము ధాన్యానికి మద్దతు ధర కన్నా ఎక్కువ ధర చెల్లిస్తున్నారని, ఇదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింతవరకు రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర కంటే అదనపు ధర మిల్లర్లు చెల్లించాలన్నారు. ఇప్పటివరకు రైస్ మిల్లర్లు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ధాన్యం ట్రాక్టర్ లోడుతో మిల్లులకు వచ్చే రైతులతో  గౌరవంగా బాధ్యతగా మిల్లర్లు వ్యవహరించాలని, మిల్లుల వద్ద రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడవలసిన బాధ్యత మిల్లర్లపై ఉందన్నారు. ప్రతి మిల్లర్లు ధాన్యం కొనుగోలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభిస్తున్నారని, అదే ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఆంధ్ర ధాన్యం రాకుండా వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్ర ధాన్యం మిర్యాలగూడ ప్రాంతానికి రాకుండా చూస్తామన్నారు.  తహసిల్దార్ సురేష్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి (బాబి), ఉపాధ్యక్షులు గోళ్ళ రామ్ శేఖర్, సూర్య రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ మోహన్ రావు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -