– దిగుమతులను గణనీయంగా నిలిపివేసింది
– చమురు సుంకాలు తగ్గిస్తాం : ట్రంప్ ప్రకటన
– వాణిజ్య ఒప్పందానికి చేరువలో ఉన్నామని వ్యాఖ్య
వాషింగ్టన్ : రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నం దుకు భారత్‌పై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రక టించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. తన నిర్ణయం ఇంధన మార్కెట్లను సమతూకం చేస్తుందని, అమెరికా-భారత్ సంబంధాలను పటిష్టపరుస్తుందని చెప్పారు. ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు పలుకుతూ అమెరికా ప్రతినిధి సభ బిల్లును ఆమోదించిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడం అమెరికా ప్రజల విజయమని ఆయన తెలిపారు.
త్వరలోనే వాణిజ్య ఒప్పందం
అంతకుముందు భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్జియో గార్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ భారతీయ వస్తువులపై ఏదో ఒక దశలో సుంకాలు తగ్గిస్తానని చెప్పారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన అన్నారు. ‘ప్రస్తుతం వారు నన్ను ప్రేమించడం లేదు. కానీ మమ్మల్ని తిరిగి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ మంచిగా ఉండే ఒప్పందానికి చేరువ అవుతున్నాం’ అని చెప్పారు. భారత్‌తో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని, ఇరు పక్షాలు సమతూకంగా ఉండే ఒప్పందానికి చేరువ అవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఒప్పందం కంటే ఇది మెరుగ్గా ఉంటుందని అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భారత్ దిగుమతులపై సుంకాలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘అవును. ప్రస్తుతం భారత్‌పై విధించిన సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రష్యా చమురే దీనికి కారణం. ఇప్పుడు వారు రష్యా నుంచి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించారు. ఏదో ఒక దశలో సుంకాలను తగ్గిస్తాం’ అని బదులిచ్చారు.
‘ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలలో భారత్ ఒకటి. అది ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. అందులో 1.5 బిలియన్ల మంది నివసిస్తున్నారు. ప్రధాని మోడీతో మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. రాయబారిగా వెళుతున్న సెర్గియో వాటిని ఇప్పటికే పెంచారు. ఎందుకంటే ఆయన మోడీతో స్నేహంగా ఉంటారు’ అని ట్రంప్ చెప్పారు.
రష్యా ఆయిల్‌కు భారత్ బ్రేక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



