నవతెలంగాణ – ఆర్మూర్
ఆదిలాబాద్‌లో గత 10 రోజుల పాటు జరిగిన ఎన్సిసి క్యాంపులో పట్టణంలోని క్షత్రియ కాలేజ్ కేడెట్లు అద్భుత ప్రతిభ కనపరిచినట్టు కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ఈవెంట్లు — గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పరేడ్ తదితర పోటీలు నిర్వహించడం జరిగింది అని, ఈ క్యాంపులో అంజన్, యువరాజ్ లు తమ అసాధారణ ప్రతిభతో బెస్ట్ కేడెట్లుగా ఎంపికయ్యారు. వారు అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి ఓవరాల్ చాంపియన్‌షిప్ ను గెలుచుకున్నారని తెలిపారు. క్యాంపు ముగింపు కార్యక్రమంలో విజేతలకు మెడల్స్ , మెమెంటోలు అందజేయడం జరిగిందని, క్యాంపు అధికారులు, ఇన్‌స్ట్రక్టర్లు, ఇతర కేడెట్లు విజేతలను అభినందించినట్టు తెలిపారు.
విద్యార్థులు ఎన్ సి సి క్యాంపులో సాధించిన విజయాలు కళాశాల గర్వకారణం. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పని చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్యాంపులో సాధించిన ఈ విజయాలు కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచాయి. విద్యతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ గుణాలు పెంపొందించుకోవడంలో ఎన్సిసి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ..కేడెట్లు చూపించిన కృషి, క్రమశిక్షణ టీమ్ స్పిరిట్ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి విజయాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అని అభిప్రాయపడ్డారు. కళాశాల ఏవో బి. నరేంద్ర మాట్లాడుతూ..ఈ విజయంలో ఎన్సిసి అధికారుల మార్గదర్శనం మరియు విద్యార్థుల కృషి కీలకం. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ఎన్సీసీ అధికారి బ్రిజేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.



