నవతెలంగాణ – జన్నారం
మండలంలోని రోటిగూడ గ్రామంలోని శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో 18 మంది నిరుపేద కుటుంబాలకు సుమారుగా రూ.46,000/= వేల విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని, ఈ సేవా కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్ అండ్ అడ్మిన్ పాలాజీ శ్రీనివాస్, సేపురి గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సేపురి గోపాల్ మాట్లాడుతూ.. “శివశక్తి సంస్థ 2023 శివరాత్రి నాడు స్థాపించబడిందన్నారు. స్థాపననాటి నుంచీ గ్రామంలోని పేదవారి సమస్యలు, అవసరాలు కమిటీ దృష్టికి వచ్చినప్పుడల్లా వీలైనంత సహాయం అందిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది” అని అన్నారు. అలాగే విరాళదాతలు, “మీరు పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభసందర్భాల్లో అందించే చిన్న విరాళం కూడా ఒక కుటుంబానికి ఆశాకిరణంలా మారుతుందన్నారు. మీరు అందించే ప్రతి రూపాయి ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. మీలాంటి దాతలే సంస్థకు బలం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి మరింతమంది నిరుపేదలకు తోడుగా నిలుస్తాం” అని అన్నారు. కార్యక్రమ ఉప్పు సురేష్, ఉప్పు భూమరెడ్డి , గ్రామ ప్రజలు, విరాళదాతలు పాల్గొన్నారు.
నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



