కవిత ఆరోపణలపై స్పందించి మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను కవిత ప్రశ్నిస్తే బాగుంటుందని. రోడ్డు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై స్పందించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి విద్యా శాఖ మంత్రిగా పనిచేసి మహాత్మగాంధీ యూనివర్సిటీలో కనీసం అడుగు కూడా పెట్టలేదన్నారు.నేను ఇప్పుడు రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు రెండేళ్లు అవుతుందని పేర్కొన్నారు.గతంలో మహాత్మగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు,ఆ పేరు పెట్టడానికి కృషి చేసింది నేనే, ఇప్పుడు కొత్త కోర్సులు తెచ్చింది నేనే అని చెప్పారు.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ సీఎం చేతుల మీదుగా ఆల్రెడీ ప్రారంభించి సాగునీరు అందిస్తున్నాం. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులు దురదృష్టవశాత్తు జరిగిన ఘటన ద్వారా ఆగాయి. మళ్ళీ పనులు మొదలు పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నాం.మొన్ననే ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సొంత ఖర్చులతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాను. అక్కడున్న డాక్టర్స్ ను, వచ్చిన పేషంట్స్ ను అడిగితే వాళ్ళే చెప్పేవారన్నారు..టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన దౌర్జన్యాలపై కవిత అప్పటి నాయకులను ప్రశ్నించాలని సూచించారు.
నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నాను. ఇవాళ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు,పలు అభివృద్ధి పనుల పై సమీక్ష కోసం వచ్చిన..నాది షెడ్యూల్ ప్రోగ్రామే అనికవిత పర్యటన,ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. తీసింది నాకు అస్సలు తెల్వదు. అని వివరించారువిషయం తెలిసి.. నేను తర్వాత మున్సిపల్ అధికారులను ఆరా తీసానన్నారు
నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏనాడు కక్ష్యా రాజకీయాలు చేయలేదు,ప్రోత్సహించలేదు. అని చెప్పారు.పార్టీలకు అతీతంగా నా దగ్గరికి ఎవరచ్చిన సాయం చేస్తా అన్నారు.
ఎన్నికలప్పుడే రాజకీయం..
తర్వాత అధికార పార్టీనా..ప్రతిపక్షమా అని చూడకుండా పనిచేసే వ్యక్తిని నేను అని కి తాబు ఇచ్చుకున్నారు.మర్రిగూడెం చౌరస్తా వద్ద నేను పెట్టించిన అంబేడ్కర్ ,జగ్జీవన్ గారి విగ్రహాల వద్ద కొంత మంది కాన్వాయ్ అడ్డుపడే ప్రయత్నం చేశారు..వారు ఎందుకు వచ్చారో కూడా తెల్వదు.మంత్రి కాన్వాయ్ కు అడ్డు వస్తారని పోలీసులు అదుపులోకి తీసుకొని ఉండవచ్చు అన్నారు..పోలీసులు,మున్సిపల్ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్ళు చేశారన్నారుఈ విషయంలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే..వదిలేయాలని చెప్పారు. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. అని వివరించారు.


