- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ, ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య ఒక భారీ మార్పిడి ఒప్పందం జరగనుందనే వార్తలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్ రాయల్స్‌కు జట్టుకు తిరిగి వెళ్లేందుకు జడేజా ఒక కీలకమైన షరతు పెట్టినట్లు సమాచారం. జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
- Advertisement -



