Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని కొత్తచెరువు తండా గ్రామ పంచాయతీ, పరిధిలోని  మంగ్త్య నాయక్ తండా, వాసంగట్టు తండా, కోనాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గతంలోని మార్కౌట్ పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు కూడా పిల్లర్లు, పునాదుల పనులను మొదలు పెట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారికి మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు వివరించారు. ఈ అవకాశాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. గతంలోని నిర్మాణాలను చేపట్టి స్లాబుల వరకు పూర్తయిన ఇండ్లకు సంబంధించి మిగతా పనులను కూడా పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకారం అందిస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, నవీన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -