నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని దేగామా చెరువులో చేపపిల్లలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చకారుల జీవితాల్లో వెలుగు నింపి తెలంగాణలో రాష్ట్రంలో నీలి విప్లవానికి నాంది పలికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైన న్యాయం చేశారని అన్నారు.
ఈ ప్రభుత్వం నిర్లక్ష్య నీ నిదర్శనమే ఈ రోజు చేప పిల్లలు పంపిణీ అన్నారు. చేపలు పట్టే సమయంలో చేప పిల్లలు వదలడం ఏమిటి అని ప్రశ్నించారు. అంతకుముందు మండల కేంద్రనికి చెందిన సూది నంది నర్సయ్య కుమారుని వివాహం స్థానిక తిరుమల గార్డెన్లో జరగగా వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయా అభివృద్ధికి ఇరవై ఒక్క వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.



