– విరిగిన విద్యుత్ పోలు.. తప్పిన ప్రమాదం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి స్టేజి వద్ద ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. గురువారం అక్కన్నపేట నుండి హుస్నాబాద్ కు వస్తున్న ఐకెపి సెంటర్ లోని వరి ధాన్యం లోడు ట్రాక్టర్ ప్రమాదకర గుంత వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పక్కన ఉన్న 11 కె వి విద్యుత్ పోలు పై ట్రాక్టర్ పడటంతో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడింది. అప్రమత్తమైన విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో ప్రధాన రోడ్డుపై వస్తున్న వాహనాలకు పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. ప్రమాదకరంగా ఉన్న గుంత ఉంచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
ప్రమాదకరంగా గుంత.. బోల్తా పడిన ధాన్యం ట్రాక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



